కేసీఆర్ ఫ్యామిలీలో అసహనం.. దినపత్రిక కథనంపై టీ-కాంగ్రెస్ ఫైర్

రాష్ట్రంలో బీఆర్ఎస్ అలజడి, అశాంతి సృష్టించి పబ్బం గడుపు కోవాలనుకుంటున్నదని కాంగ్రెస్ ఆరోపించింది.

Update: 2024-07-06 05:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అధికారం దూరం కావడంతో కేసీఆర్ కుటుంబంలో అసహనం విలయ తాండవం చేస్తోందని టీ కాంగ్రెస్ ఫైర్ అయింది. నిన్నటి టీజీపీఎస్సీ ముట్టడిపై ఓ దినపత్రిక ప్రచురించిన కథనంపై (దిశ కాదు) టీ కాంగ్రెస్ రియాక్ట్ అయింది. సదరు విష పత్రిక వంకర రాతలు రాస్తోందని మండిపడింది. పదేళ్లు పాపాలన్నింటికీ బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కుటుంబమే పెద్దరికం వహించిందని, నాడు నిరుద్యోగులను కనీసం గొంతు కూడా విప్పకుండా నిర్భందించి నేడు తమ పార్టీ కార్యకర్తలను టీజీపీఎస్సీ మీదకు ఉసిగొల్పి అలజడి, అశాంతి సృష్టించి పబ్బం గడుపు కోవాలనుకుంటుందని ఆరోపించింది. గత ప్రభుత్వంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తోందని, ఇచ్చిన మాట ప్రకారం బడ్జెట్ సమావేశాల నాటికి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీల భర్తీకి కసరత్తు చేస్తోందని పేర్కొంది.

Tags:    

Similar News