నెక్లెస్ రోడ్డులో నాట్యమాడిన శ్వేతనాగు

దట్టమైన అడవుల్లో, మారుమూల కుగ్రామాల్లో మాత్రమే అరుదుగా కనిపించే శ్వేతనాగు హైదరాబాద్ వంటి మెట్రో నగరంలో ప్రత్యక్షమైంది.

Update: 2024-08-13 16:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : దట్టమైన అడవుల్లో, మారుమూల కుగ్రామాల్లో మాత్రమే అరుదుగా కనిపించే శ్వేతనాగు హైదరాబాద్ వంటి మెట్రో నగరంలో ప్రత్యక్షమైంది. హుస్సేన్ సాగర్ వద్ద గల నెక్లెస్ రోడ్డులోని చెట్ల పొదల్లో నుండి జలవిహార్ గోడ మీదికి పాకుతూ వచ్చింది. అటుగా వెళ్తున్నవారు, జలవిహార్ సందర్శనకు వచ్చినవారు భయంతో పరుగులు తీశారు. కాగా గోడపై కాసేపు పడగెత్తి నాట్యమాడిన శ్వేతనాగు, కాసేపటికి అటుగా వెళ్తున్న ఉడుత ఒకదానికొకటి ఎదురెదురుగా ప్రత్యక్షం అయ్యాయి. పాము ఉడతను మింగేయడానికి అమాంతం మీదికి దూకగా.. ఉడత తప్పించుకొని చెట్టు మీదికి పరుగులు తీసింది. అక్కడున్న వారు ఈ సంఘటను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.  


Similar News