సురేఖ గారూ.. రాజకీయాల్లోకి నన్ను లాగకండి : నటి సమంత ఘాటు స్పందన
తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటి సమంత(Samantha) ఘాటుగా స్పందించారు.
దిశ, వెబ్ డెస్క్ : తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటి సమంత(Samantha) ఘాటుగా స్పందించారు. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగకండి మంత్రిగారూ అంటూ కటువుగానే చెప్పారు సమంత. 'మహిళల్ని వస్తువుల్లా చూసే ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం, ప్రేమలో పడటం, నిలబడి పోరాడటానికి చాలా శక్తి కావాలి. దయచేసి నా ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దు. ఇక విడాకులనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయం. అది ఇద్దరి అంగీకారంతో జరిగింది. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరం పెట్టండి' అని ఓ ప్రకటనలో సూచించారు.
Also Read...
ఎన్ కన్వెన్షన్ కూల్చొద్దంటే కేటీఆర్ సమంతను పంపాలన్నాడు : Konda Surekha
మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి.. హీరో నాగార్జున డిమాండ్