సీఎం రేవంత్ రెడ్డి మీద సుప్రీం కోర్ట్ ఆగ్రహం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పొందడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ ప్రసంగంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2024-08-29 10:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పొందడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ ప్రసంగంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నిందితులకు తాము బెయిల్ ఇస్తామా అని రేవంత్ తరపున వాదించిన అడ్వొకేట్లను సూటిగా ప్రశ్నించింది. గురువారం ఓటుకు నోటు విచారణ సందర్భంగా సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ గవాయి రేవంత్ వ్యాఖ్యలను తప్పు బట్టారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీం కోర్టు పట్ల గౌరవంగా ఉండాలని, రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రమూ సరికాదని అన్నారు. ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి సీఎం పదవిలో ఉన్నాడు కాబట్టి కేసు బదిలీని పిటిషనర్ కోరినట్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయమంటారా అని రేవంత్ తరపున అడ్వొకేట్లు ముఖుల్ రోహత్గీ, సిద్దార్థ్ లూత్రాను న్యాయమూర్తి ప్రశ్నించగా.. మరోసారి ఇలా జరగదని వారు కోర్టుకు హామీ ఇచ్చారు. అనంతరం ఓటుకు నోటు కేసు సోమవారానికి వాయిదా పడింది.    


Similar News