Tirumala laddu: మతమార్పిడి చేసుకున్న సీఎం పాలించడం వల్లే ఈ పరిస్థితి..తిరుమల లడ్డూ వివాదంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ (Tirumala laddu) ప్రసాదంలో కల్తీ నెయ్యి(Adulterated Ghee) వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-21 21:00 GMT

దిశ, వెబ్‌డెస్క్:తిరుమల లడ్డూ (Tirumala laddu) ప్రసాదంలో కల్తీ నెయ్యి(Adulterated Ghee) వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు(Animal Fat) వాడారంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం(AP CM) చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) చేసిన సంచలన ప్రకటనతో.. ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ అంశంపై పలువురు రాజీకీయ నాయకులు(Political Leaders) ఇప్పటికే స్పందించారు.ఇదిలా ఉంటే..తాజాగా ఈ వివాదంపై బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌(BJP Fire Brand) మాధవీలత(Madhavi Latha) సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం తన ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడూతూ..'లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటే ఈ జన్మకు ఇంతకన్నా పాపం అంటగట్టుకోవడం కంటే ఇంకా వేరేది లేదని, ఈ ఘటన మాటల్లో కూడా చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి(Miserable Situation) అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మతమార్పిడి(proselytizing) చేసుకున్న నాయకులు పాలించడం వల్లే తిరుమలలో ఈ పరిస్థితి నెలకొందని,అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని మాధవీలత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తిరుమల తిరుపతిలో జరిగింది చిన్న విషయం కాదని కేవలం లడ్డూపైనే కాదు.. మొత్తం శ్రీవారి ఆస్తులపై విచారణ జరగాలని కోరారు. ఈ ఘటనపై అందరం కలిసి పోరాటం చేయాలని, ఈ విషయంలో నిజం తేలే వరకు వదిలిపెట్టనని తేల్చి చెప్పారు.ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐతో విచారణ(CBI Inquiry) చేయించాలని' మాధవీలత డిమాండ్‌ చేశారు. 


Similar News