సుందిళ్ల బ్యారేజీ ఖాళీ..ఇసుక, మట్టి దిబ్బలతో దర్శనం

పార్వతీ బ్యారేజీలో నీటిని అధికారులు దిగువకు వదిలిపెట్టారు.

Update: 2024-05-21 12:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద గల సుందిళ్ల పార్వతి బ్యారేజీ ఖాళీ అయింది. బ్యారేజీ మరమ్మతుల కోసం ప్రాజెక్టులోని నీటిని అధికారులు దిగువకు వదిలిపెట్టారు. దీంతో రెండు రోజుల్లోనే నీళ్లన్ని ఖాళీ అయి వెలవెలబోతున్నది. ప్రస్తుతం ఇసుక, మట్టి దిబ్బలతో జలాశయం దర్శనం ఇస్తోంది. గేట్ల వద్ద మీటరు ఎత్తు వరకు మాత్రమే నీరు ఉండటంతో చుట్టు పక్కల గ్రామస్తులు చేపలు పట్టుకునేందుకు ఎగబడ్డారు. కాగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ స్థితిగతులపై పరీక్షలు చేయించాలని నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఇవ్వగా ఈ నివేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులతో ఇటీవల చర్చించి టెస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News