సండే ఎఫెక్ట్.. నాగార్జున సాగర్ కు పోటెత్తిన సందర్శకులు.. భారీగా ఆంక్షలు విధించిన పోలీసులు

శ్రీశైలం జలాశయం నుంచి కంటిన్యూగా వరద వస్తుండటంతో ఆదివారం రోజు సాగర్ డ్యాం పది గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Update: 2024-08-11 04:22 GMT

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం జలాశయం నుంచి కంటిన్యూగా వరద వస్తుండటంతో ఆదివారం రోజు సాగర్ డ్యాం పది గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ అందాలను చూసేందుకు సందర్శకులు భారీగా వస్తున్నారు. కాగా ఈ రోజు ఆదివారం సెలవు కావడంతో సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది. ఉదయం నుంచి వేల సంఖ్యలో సందర్శకులు వస్తుండటం.. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా.. నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ పైకే వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. అలాగే పవర్ హౌస్ వద్ద ఉన్న సందర్భకుల ప్రాంతాన్ని కూడా మూసివేశారు. ప్రజల రక్షణ కొరకు ఇలా చేయడం జరిగిందని.. సందర్శకులు అర్థం చేసుకొవాలని పోలీసులు సూచించారు. కాగా సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 587.30 అడుగుల నీరు ఉంది. అలాగే సాగర్ నీటి నిల్వ సామర్ధ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం.. 305.68 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి సాగర్ కు 1,17,396 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.


Similar News