ఇళ్ళను తొలగించ లేకనే కేసీఆర్ మూసీ ప్రక్షాళన ఆపేశారు : సుధీర్ రెడ్డి

మూసీ నది పరివాహకంలో వేలాది ఆక్రమణలు..ఇళ్ళు తొలగించి అంతమందికి పునరావాసం కల్పించలేక..అర్థిక భారం నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో మూసీ న‌ది ప్రక్షాళన ప్రాజెక్టును ఆపేయమన్నారని మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌లప్మెంట్ కార్పొరేష‌న్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెల్లడించారు.

Update: 2024-10-03 12:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : మూసీ నది పరివాహకంలో వేలాది ఆక్రమణలు..ఇళ్ళు తొలగించి అంతమందికి పునరావాసం కల్పించలేక..అర్థిక భారం నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో మూసీ న‌ది ప్రక్షాళన ప్రాజెక్టును ఆపేయమన్నారని మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌లప్మెంట్ కార్పొరేష‌న్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెల్లడించారు. మూసీ నదిని బ్రహ్మాండ‌గా అభివృద్ధి చేయాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌గా ఉండేదన్నారు. నేను పార్టీలో చేరాక‌ న‌న్ను మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌లప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ గా నియ‌మించారన్నారు. మూసీ ప్రక్షాళన కోసం తొలి దశలో ముందుగా న‌గరానికి సంబంధించిన 96% డ్రైనేజ్ నీరు మూసీ న‌దిలోకి వ‌స్తుందని, డ్రైనేజీ వాటర్ ను ఒక చోట చేర్చాలని నిర్ణయించారని, ఈ డ్రైనేజీ నీటిని సేక‌రించి, శుద్ధిప‌రిచి తిరిగి శుభ్రమైన నీరు మూసీలోకి వ‌ద‌లాల‌ని కేసీఆర్ అనుకున్నారని తెలిపారు. ఇందుకోసం 3,800కోట్లతో 32 సివరేజ్ ట్రిట్ మెంట్ ప్లాంట్లను నిర్మించతల పెట్టామని, అందులో 8పూర్తి చేశామన్నారు. అంతకుముందున్న 4ఎస్టీఎఫ్ లను ప్రారంభించామన్నారు. మూసీలోకి స్వచ్చమైన నీటిని వదలడం ద్వారా దోమలు, దుర్వాసన నివారించవచ్చన్నది అప్పట్లో మా ఉద్దేశమన్నారు.

రెండో దశలో అప్పటిదాక లేని మూసీ నది రివర్ బౌండరీ జోన్, బఫర్ జోన్లను నిర్ణయించేందుకు అధికారులు, నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. రివర్ బౌండరీ నుంచి నది రెండువైపుల 50మీటర్ల చొప్పున బఫర జోన్ నిర్ణయించామన్నారు. బఫర్ జోన్ లో వేలాది మంది ఇళ్ళు తొలగించాల్సి వస్తుండటంతో కేటీఆర్, కేసీఆర్ ల దృష్టికి తీసుకెళ్ళామన్నారు. అంతమంది పేదల ఇళ్ళ తొలగింపు వ్యవహారం కావడంతో ఆందోళన చెందిన కేటీఆర్ విషయాన్ని కేసీఆర్ తో చర్చించాలన్నారని. సమస్యను అప్పటీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళామని ఆయన తెలిపారు. వేలాది మంది ఇళ్ళు తొలగించాల్సి వుండటంతో అంత మందికి పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం వద్ద డబ్బు లేదని తాత్కాలికంగా దీన్ని పక్కన పెట్టమని కేసీఆర్ సూచించారని సుధీర్ రెడ్డి వెల్లడించారు. 


Similar News