విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి : ఎమ్మెల్సీ కవిత

బోధన్‌లో ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో ఉంటూ మరణించిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని, ఆ కుటుంబంలో ఒకరికి అర్హతలకు తగిన ఉద్యోగాన్ని ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.

Update: 2024-03-05 09:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బోధన్‌లో ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో ఉంటూ మరణించిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని, ఆ కుటుంబంలో ఒకరికి అర్హతలకు తగిన ఉద్యోగాన్ని ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. గాంధారి మండలం తిప్పారం తండాకు చెందిన హర్యాల వెంకట్‌రామ్ ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ చనిపోవడంతో కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత బుధవారం పరామర్శించారు. ఫ్యామిలీ మెంబర్లను ఓదార్చిన ఆమె.. అండగా నిలుస్తామని భరోసా ఇవ్వడంతో పాటు ఆర్థిక సాయాన్ని అందించారు. ప్రభుత్వ హాస్టళ్ళలో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


Similar News