TS DSC 2024 Appointment Orders: నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు.
డీఎస్సీ-2024 (DSC-2024) ద్వారా ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఎల్బీ స్టేడియం (LB Stadium) వేదికగా నియామక పత్రాలను అందజేయనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: డీఎస్సీ-2024 (DSC-2024) ద్వారా ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఎల్బీ స్టేడియం (LB Stadium) వేదికగా నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ మేరకు 10,006 మంది అపాయింట్‌మెంట్ ఆర్డర్లు (Appointment Orders) తీసుకోనున్నారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లా (Hyderabad District) నుంచి 761 మంది.. అత్యల్పంగా పెద్దపల్లి జిల్లా (Peddapally District) నుంచి 82 మంది కొత్త టీచర్లు నియామక పత్రాలను అందుకోబోతున్నారు. ఇప్పటికే ఎంపికైన వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ (Certificate Verification) ప్రక్రియను జిల్లా కలెక్టర్లు (District Collectors) పూర్తి చేశారు. ఇవాళ ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో కొత్త టీచర్లను హైదరాబాద్ (Hyderabad)కు తీసుకురానున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా ఎల్బీ స్టేడియంలో జిల్లాల వారీగా స్పెషల్ కౌంటర్ల (Special Counters)ను ఏర్పాటు చేశారు. టీచర్లు ఎవరి జిల్లా కౌంటర్లలో వారు నియామక పత్రాలను తీసుకోవాలని అధికారులు సూచించారు. డీఎస్సీతో ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు దసరా సెలువులలోపే పోస్టింగ్స్ ఇచ్చేలా అధికారులు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
అయితే, డీఎస్సీ-2024లో భాగంగా మొత్తం 11,062 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 10,006 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు విద్యాశాఖ (Education Department) ప్రకటించింది. అందులో కోర్టు కేసుల నేపథ్యంలో 1,056 స్పెషల్ ఎడ్యుకేటర్లు, పీఈటీల పోస్టుల భర్తీకి అవాంతరం ఎదురైంది. త్వరలోనే ఆ పోస్టుల భర్తీపై కూడా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.