రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ విభాగం బలోపేతం : వైద్యారోగ్య కార్యదర్శి క్రిస్టినా
రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ అధికారులను ఆదేశించారు. ఫుడ్ తయారీదారులందరూ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను తప్పనిసరిగా కలిగి ఉండేలా ఫుడ్ సేఫ్టీ అధికారులు అవగాహన ను కల్పించాలన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు వైద్యారోగ్య కార్యదర్శి క్రిస్టినా అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమవేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ తయారీ దారులు, రెస్టారెంట్, హోటల్ నిర్వాహకులు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ఫుడ్ సేఫ్టీ లో భాగంగా ఫుడ్ తయారీదారులందరూ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను విధిగా కలిగి ఉండేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ విభాగం లో అదనపు సిబ్బందినీ పూర్తిస్థాయిలో త్వరలోనే నియమిస్తామన్నారు. . రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ లో భాగంగా సేకరించిన ఆహార శాంపిల్స్ ను పరీక్షించడానికి అదనంగా మినీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లు ఏర్పాటు చేయాలని, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమీక్ష లో రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ (ఆహార భద్రత) పై చర్చించారు. జిహెచ్ఎంసి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో సీనియర్ అధికారులను ఫుడ్ సేఫ్టీ నియంత్రణ పై పర్యవేక్షకులుగా నియమిస్తామన్నారు .రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ లో భాగంగా సేకరించిన ఆహార శాంపిల్స్ ను పరీక్షించడానికి అదనంగా ఫుడ్ టెస్టింగ్ మినీ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫుడ్ నాణ్యత ను పాటించని ఆహార తయారీ దారులు పట్ల కఠినంగా వ్యవహరించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న హైదరాబాద్ వంటకాలు బ్రాండ్ ఇమేజ్ ని పెంపొందించేలా ఫుడ్ సేఫ్టీ అధికారులు కృషి చేయాలని అదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి.కర్ణన్, జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి, ఐపిఎం డైరెక్టర్ శివలీల, జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ పంకజా, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.