పెట్రోల్ బంక్‌లో చోరీకి విఫలయత్నం.. సిబ్బందిపై రాళ్లతో దాడి
కామారెడ్డి జిల్లా బీర్కూర్ ఇండియన్ పెట్రోల్ బoక్‌లో ఇద్దరు వ్యక్తులు చొరబడి నగదు అపహరణకు యత్నించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బీర్కూర్ ఇండియన్ పెట్రోల్ బoక్‌లో ఇద్దరు వ్యక్తులు చొరబడి నగదు అపహరణకు యత్నించారు. గురువారం రాత్రి బంక్‌లో పనిచేస్తున్న సిబ్బంది తలపై బండరాయితో దాడికి పాల్పడ్డారు. పారిపోతున్న దొంగలను పట్టుకునేoదుకు వచ్చిన స్థానికులపై కత్తులతో దాడికి దుండగులు యత్నించారు. దొంగతనానికి యత్నించిన ఇద్దరిని పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నగదు చోరీకి యత్నించిన వీరు బాన్సువాడ పట్టణానికి చెందిన సందీప్ రెడ్డి, సోమేశ్వర్‌కు చెందిన సంతోష్‌లుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.