వాహనదారులకు బిగ్ అలర్ట్.. రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ కీలక సూచన

తెలంగాణలో తిరుగుతున్న ఇతర రాష్ట్ర వాహనదారులకు రాష్ట్ర రోడ్డురవాణాశాఖ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీ చేసింది.

Update: 2024-06-19 13:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో తిరుగుతున్న ఇతర రాష్ట్ర వాహనదారులకు రాష్ట్ర రోడ్డురవాణాశాఖ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో తిరిగే పొరుగు రాష్ట్రాల మోటార్ వాహనాలు, కార్లు, ద్విచక్రవాహనాలకు యజమానులు విధిగా లైఫ్ టాక్స్ చెల్లించాలని జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సి.రమేష్ కోరారు. లైఫ్ టాక్స్ గడువు ముగిసిన వాహనాలు రోడ్డుమీదకు వస్తే మోటార్ వెహికిల్స్ ఇన్స్ పెక్టర్లు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. రవాణాశాఖ నిబంధనల ప్రకారం ఏదైనా ఇతర రాష్ట్రాల వాహనం తెలంగాణలో 30రోజులకు మించి ఉంటే లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆదేశాలను వాహనదారులు పాటించాలని సూచించారు. టాక్స్ వసూళ్లకు ముమ్మర తనిఖీ చేపట్టనున్నట్లు వెల్లడించారు.


Similar News