Telangana Kabaddi Association: అధ్యక్షుడిగా కాసాని వీరేశ్ ముదిరాజ్

తెలంగాణ కబడ్డీ అసోసియేషన్(Telangana Kabaddi Association) జనరల్ బాడీ సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.

Update: 2024-10-27 17:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్(Telangana Kabaddi Association) జనరల్ బాడీ సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన కబడ్డీ అసోసియేషన్(Kabaddi Association) సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కబడ్డీ అసోసియేషన్(Kabaddi Association) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి జగన్మోహన్ వ్యవహరించారు. ఎన్నికల అబ్జర్వర్లుగా ఇండియన్ ఒలింపిక్ సంఘం సభ్యులు, ఏకెఎఫ్ఐ ప్రతినిధులు పాల్గొని ఎన్నికలను నిర్వహించారు.

తెలంగాణ కబడ్డీ అసోసియేషన్(Telangana Kabaddi Association) నూతన అధ్యక్షుడిగా కాసాని వీరేశ్ ముదిరాజ్(Kasani Veeresh Mudiraj) ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా మహేందర్ రెడ్డి, కోశాధికారిగా రవి, ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కాసాని వీరేశ్ ముదిరాజ్(Kasani Veeresh Mudiraj) మాట్లాడుతూ.. తనమీద నమ్మకంతో పూర్తి విశ్వాశంతో ఉంచిన భాద్యతను శక్తి వంచనలేకుండా సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. కబడ్డీ క్రీడాకారులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తేచ్చేలా తన శక్తియుక్తులా కృషిచేస్తానని వెల్లడించారు. గ్రామీణ క్రీడ అయిన కబడ్డీకి తన వంతు సేవను చేసే అదృష్టాన్ని, అవకాశాన్ని కల్పించినందుకు కబడ్డీ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News