Janwada Farmhouse స్థానికుల ఫిర్యాదు మేరకే రెయిడ్ చేశారు: మంత్రి పొన్నం ప్రభాకర్

దొరికిన దొంగలు సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఫైర్ అయ్యారు.

Update: 2024-10-27 17:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దొరికిన దొంగలు సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఫైర్ అయ్యారు. తాగి దొరికిన కేసులో బుకాయించి మాట్లాడితే తప్పు ఒప్పైతదనుకుంటే పొరపాటు అని విమర్శించారు. పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా స్థానికుల ఫిర్యాదు మేరకు జన్వాడ ఫామ్‌హౌస్‌ (Janwada Farmhouse)లో రెయిడ్ చేశారన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి కక్ష్య సాధింపు ధోరణి లేదన్నారు. సీఎం(CM), మంత్రులంతా క్యాబినేట్,ఇతర ప్రోగ్రామ్‌లలో బీజీగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్(BRS) తప్పుచేసి, కాంగ్రెస్ (Congress)ను బద్నాం చేయాలని చూస్తుందని ఆయన ఆదివారం ఓ వీడియోలో మండిపడ్డారు. పోలీసులు స్పందించకపోతే కుమ్మక్కైయ్యారని మళ్లీ బీజేపీ కిషన్ రెడ్డి, ఎంపీ ఈటలను మాట్లాడతారని, అసలు ఈ కేసు మీద బీజేపీ(BJP) స్టాండ్ స్పష్టంగా చెప్పాలన్నారు. నిజంగా నిర్దోషులైతే, చట్టం ద్వారా క్లారిఫికేషన్ తెచ్చుకోవాలని సూచించారు. కేసును పక్కదారి పట్టించేందుకు పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం సరికాదన్నారు. రాజకీయ మిత్రులకు లొంగకుండా కేసు విచారణ చేయాలని పోలీసులను కోరుతున్నానని పేర్కొన్నారు.


Similar News