MP Etala : రాష్ట్ర ప్రభుత్వం పంట బీమా అమలు చేయాలి : ఎంపీ ఈటల
రాష్ట్ర ప్రభుత్వం(State Government)వెంటనే పంట భీమా(Crop Insurance)అమలు చేయాలని, ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు ఎవరో వస్తారు సాయం చేస్తారు అనే పరిస్థితి లేకుండా వారికి భరోసా కల్పించాని బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etala Rajender)డిమాండ్ చేశారు
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం(State Government)వెంటనే పంట భీమా(Crop Insurance)అమలు చేయాలని, ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు ఎవరో వస్తారు సాయం చేస్తారు అనే పరిస్థితి లేకుండా వారికి భరోసా కల్పించాని బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etala Rajender)డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమాని(Farmer Welfare)కి పీఎం కిసాన్ సహాయం, ఎరువుల సబ్సిడీ పెంచుతూ, ఫసల్ బీమా పరిధిని విస్తరిస్తూ కేంద్ర కేబినెట్(Union Cabinet)తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన హర్షాతీరేకాలు వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతికతను దేశానికి అందించడమే కాదు.. రైతాంగానికి వ్యవసాయానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతే పెద్దపీట వేస్తుందన్నారు.
డీఏపీ రాయితీకి గత ఏడాది 2625 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 3850 కోట్ల రూపాయలు కేటాయించిందని గుర్తు చేశారు. రైతులపై భారం పడకుండా కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలన్నారు. పంట భీమాకు 69 వేల 551 కోట్లు కేటాయించిందని, నూతన సంవత్సరం మొదటి రోజు రైతులకోసం మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు రైతు సంక్షేమానికి దోహదం చేస్తాయన్నారు. రైతులకు డిజిటల్ విధానంలో పంట బీమాను నేరుగా కేంద్రం చెల్లించాలన్న నిర్ణయం విప్లవాత్మకమైందన్నారు.