ట్రైబల్ యూనివర్సిటీని ప్రారంభించండి.. సీఎంకు వినతి
రాష్ట్రంలో ట్రైబల్ యూనివర్సిటీని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజారాం నాయక్ లు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
దిశ, సికింద్రాబాద్: రాష్ట్రంలో ట్రైబల్ యూనివర్సిటీని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజారాం నాయక్ లు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా శరత్ నాయక్ మాట్లాడతూ పునర్విభజన చట్టంలో పేర్కొనబడిన గిరిజన యూనివర్సిటీ ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. 2019 లోనే 335 ఎకరాల భూమిని కేటాయించామని చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేసి, సరిపడా బడ్జెట్ ను కేటాయించాలని డిమాండ్ చేశారు. తక్షణమే వీసీని నియమించి, వచ్చే విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని కోరారు.