Srisailam Reservoir: శ్రీశైలం జలశయానికి పోటెత్తిన వరద నీరు.. తాజా అప్‌డేట్ ఇదే!

కర్ణాటక సహా ఎదుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద ఉధృతి బీభత్సంగా కొనసాగుతోంది.

Update: 2024-07-21 01:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక సహా ఎదుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద ఉధృతి బీభత్సంగా కొనసాగుతోంది. ఈ పరిణామంతో జూరాలతో పాటు శ్రీశైలం జలశయాలు నిండుకుండలా మారాయి. తాజాగా శ్రీశైలం ప్రాజెక్ట్‌ నీటి మట్టాలను అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం ఇన్ ఫ్లో 99,894 క్యూసెక్కులుగా ఉందని పేర్కొన్నారు. ఔట్ ఫ్లో ఇప్పటికైతే నిల్‌గా ఉందని తెలిపారు.. కాగా పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం నీరు 814.50 అడుగులు ఉన్నట్లుగా తెలిపారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 37.0334 టీఎంసీల వరద నీరు వచ్చిందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ప్రాజెక్ట్‌లోకి వరద ఉధృతి కొనసాగుతుండటంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 

Tags:    

Similar News