చీలిపోతున్న అధికారులు, సిబ్బంది.. BRSకు పోలీసు ఓటు టెన్షన్!

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలో విచిత్ర పరిస్థితి నెలకొంది.

Update: 2023-11-24 07:18 GMT

దిశ, రాచకొండ : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒక వైపు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, అధికారులు ఇప్పుడు వారికి నచ్చిన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పని చేస్తున్నారు. దీంతో ఇప్పుడు పోలీసు శాఖలో వర్గాలుగా చీలిపోయారు. ఇలా విడిపోయిన వారిలో అదనపు డీజీపీ స్థాయి అధికారుల నుంచి హోమ్ గార్డ్‌ల వరకు ఉన్నారు. తెలంగాణ అత్యంత బలవంతమైన సామాజిక వర్గంగా ముద్రపడిన అధికారులు బీ‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఇప్పుడు పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇంకా కొందరు బీఆర్‌ఎస్ వచ్చినా తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో తమకు ప్రజల్లో విలువ లేకుండా చేసారని అనే కోపంతో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే మరింత ఇబ్బందులు వస్తాయని భావన ఏర్పడింది. ఇలా పోలీసు శాఖలో అత్యధికంగా బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి రాకుండా వారు ఫీల్డ్‌లో చాలా మందిని ప్రభావితం చేసేలా మౌత్ టాక్‌ను నమ్ముకున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అధికారులు బీఆర్‌ఎస్, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రచారంలో ఉంది.

కిందిస్థాయి ఎస్ఐ నుంచి హోమ్ గార్డ్స్ వరకు కూడా పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌పై మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇక బలమైన సామాజిక వర్గం అధికారులు ఆశిస్తున్న పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ పాత రోజులు వస్తాయని కొంత మంది పోలీసుల్లో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌లో చాలా మంది పోలీసులు దూరంగా ఉన్నామని, మరి కొంత మంది అధికార పార్టీకి ఓటు వేయలేదని చెప్పి ఇండైరెక్ట్‌గా వ్యతిరేకతను పెంచుతున్నారని స్పష్టమవుతుంది.

Tags:    

Similar News