టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు.. అధికారులకు ఆదేశాలు జారీ

పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 3 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

Update: 2023-02-10 16:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 3 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు విద్యార్థులకు సాయంత్రం స్పెషల్ క్లాసులు నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక తరగతులు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వం, మోడల్ స్కూళ్లలో అమలు చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ల దేవసేన అధికారులను ఆదేశించారు. ఈనెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు దాదాపు 34 రోజుల పాటు ఈ తరగతులు కొనసాగనున్నాయి.

సాయంత్రం వేళ క్లాసులు ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను రూ. 9,67,93,410 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. ప్రతిరోజు ఒక్కో విద్యార్థిపై రూ.15 చొప్పున ఖర్చు చేయనున్నట్లు స్పష్టంచేశారు. విద్యార్థుల స్పెషల్ క్లాస్ కు తగినట్లగా అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని దేవసేన ఆదేశించారు. ఇదిలా ఉండగా పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం కోసం బడ్జెట్ కేటాయించడాన్ని టీఎస్ యూటీఎఫ్ స్వాగతించింది. ఏప్రిల్ 3వ తేదీన పరీక్​షలు ప్రారంభమవుతుండగా 13వ తేదీతో ఎగ్జామ్స్ ముగియనున్నాయి.

Tags:    

Similar News