Gaddam Prasad:స్పీకర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. అనుచిత పోస్టులు పెట్టిన దుండగులు
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ గురైనది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ గురైనది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. పెరుగుతున్న టెక్నాలజీతో పాటు సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు మితిమీరిపోతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడి సామన్యుల ఖాతాలను దోచుకోవడమే గాక.. సోషల్ మీడియాలో ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేసి వారికి సంబందం లేని పోస్టులు పెడుతుంటారు. ఈ నేపధ్యంలోనే అసెంబ్లీ స్పీకర్ ఎక్స్ ఖాతాను కూడా హ్యాక్ చేసి, ఆయనకు సంబందం లేని పోస్టులు పెట్టారు. వెంటనే గుర్తించిన ఆయన టీం.. హ్యకింగ్ నుంచి రక్షించి హ్యాకర్లు పెట్టిన పోస్టులను తొలగించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఎక్స్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా సూచన అంటూ.. ఈరోజు ఉదయం నా వ్యక్తిగత X (TWITTER) అకౌంట్ కొంత సమయం హ్యాకింగ్ (Hacking) అయిందని, మా టెక్నికల్ టీం ఈ విషయాన్ని గమనించి వెంటనే తగిన చర్యలు తీసుకుని తిరిగి సెట్ చేశారని తెలిపారు. నా ఎక్స్ హ్యాకింగ్ అయిన సమయంలో నా అకౌంట్ లో వచ్చిన వీడియోలు, పోస్ట్‌లకు తనకు సంబంధం లేదని గడ్డం ప్రసాద్ కుమార్ తెలియజేశారు.