బాసర సరస్వతి ఆలయంలో పాము కలకలం
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో పాము కలకలం రేపింది.
దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో పాము కలకలం రేపింది. అక్షరాభ్యాస మండపంలో పాము కనిపించింది. ఒక్క సారిగా పామును చూసిన భక్తులు పరుగులు తీశారు. పామును పట్టుకుని స్నేక్ క్యాచర్ బయట విడిచిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.