సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్.. ఎన్ని ఎకరాలకు సాగునీరు అందనుందంటే..?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. బీ.జీ కొత్తూరు వద్ద మొదటి లిఫ్ ట్రయల్ రన్ చేయగా.. మంత్రి తుమ్మల నాగేశ్వర్ పంప్ హౌస్‌ను పరిశీలించారు.

Update: 2024-06-27 06:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. బీ.జీ కొత్తూరు వద్ద మొదటి లిఫ్ ట్రయల్ రన్ చేయగా.. మంత్రి తుమ్మల నాగేశ్వర్ పంప్ హౌస్‌ను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలు సస్య శ్యామలం కానున్నాయి. వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌కు పారేలా చర్యలు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనుంది. ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 3 లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. మరోవైపు నేడు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, తుమ్మల కొత్తగూడెంలో పర్యటించనున్నారు. 


Similar News