ICICI Scam: ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో కీలక ట్విస్ట్
ఐసీఐసీఐ బ్యాంక్ స్కాం ఊహించని మలుపు తిరిగింది.
దిశ, వెబ్‌డెస్క్: ఐసీఐసీఐ బ్యాంక్ స్కాం ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో ఏ1గా ఉన్న చిలకలూరిపేట బ్యాంక్ మేనేజర్ నరేష్ చంద్రశేఖర్ (Naresh Chandrasekhar)పై మిస్సింగ్ కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం నరేష్ భార్య సరోజిని తన భర్త కనిపించకుండా పోయాడంటూ పటమట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 26న నరేష్ హైదరాబాద్ (Hyderabad) వెళ్లాడని, 28న ఫోన్ చేసి తనకు రావల్సిన డబ్బులు రావడం లేదని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని సరోజిని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి బెజవాడ పోలీసులు నరేష్ కోసం ఆంధ్రాలో వెతుకుంతే.. హైదరాబాద్‌లో సీఐడీ పోలీసులు జల్లెడ పట్టి గాలిస్తున్నారు.