HYDRA : హైడ్రా @100 డేస్.. ఆక్రమణల తొలగింపే లక్ష్యంగా దూకుడు.. ప్రభుత్వం మరో ఆలోచన!
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా Hydra (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) నేటికి వంద రోజులు పూర్తి చేసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా Hydra (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) నేటికి వంద రోజులు పూర్తి చేసుకుంది. హైదరాబాద్ పరిధిలోని విపత్తుల నివారణ, ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత జూలై 19న జీవో 99 తో హైడ్రా ఏర్పాటు చేసింది. గత జులై 26 నుంచి హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఇప్పటివరకు 30 ప్రాంతాల్లో 300 అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. Hydra హైడ్రా దాదాపు 120 ఎకరాలను స్వాధీనం చేసుకోని ప్రభుత్వానికి అప్పగించింది. GHMC జీహెచ్ఎంసీతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో హైడ్రా పంజా విసిరింది.
Nagarjuna Akkineni నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పేరు దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. అదేవిధంగా హైడ్రా కూల్చివేతలు సంచలనంగా మారాయి. ఒకవైపు వివాదాలు, రాజకీయ విమర్శలు, మరోవైపు ప్రశంసలు హైడ్రా అందుకుంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారనే ఆందోళనలు చెలరేగాయి. హైడ్రాను రద్దు చేయాలనే ఫిర్యాదులు వచ్చాయి. అయిన కూడా Telangana High Court తెలంగాణ హైకోర్టులో హైడ్రాకు ఊరట లభించింది. హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేదని High Court ధర్మాసనం తెలిపింది. ఈ క్రమంలోనే జీవో 191తో హైడ్రాకు ప్రభుత్వం ఫుల్ పవర్స్ ఇచ్చింది. నగరంలో వరద ముంపునకు పరిష్కారం, ట్రాఫిక్ నియంత్రణ, చెట్ల సంరక్షణపై హైడ్రా ఫోకస్ పెట్టింది. కాగా, ఒకవైపు విమర్శలు మరోవైపు ప్రశంసల నడుమ హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. హైడ్రా కమిషనర్‌గా ఏవీ రంగనాథ్ AV Ranganath ఉన్న విషయం తెలిసిందే.