సీతారామ ప్రాజెక్ట్.. ట్రయల్ రన్‌ను ప్రారంభించిన మంత్రులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సీతారామా ప్రాజెక్టు పంప్ హౌస్-2ను తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సీతారామా ప్రాజెక్టు పంప్ హౌస్-2ను తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ పంప్ హౌస్ నిర్మాణం పూర్తి కావడంతో ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు పంప్ హౌస్ ను పరిశీలించిన మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి కలిసి.. పుసుగూడెం, కమలాపురం పంపుహౌస్ల వద్ద పర్యటించారు. అనంతరం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సీతారామా ప్రాజెక్టు పంప్ హౌస్-2 ట్రయల్ రన్‌ను ప్రారంభించారు.