బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి దేశంలోనే నంబర్ వన్ : Kalvakuntla Kavitha
సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సింగరేణి ఆవిర్భవించి 102 సంవత్సరాలైన సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా కార్మికులకు, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ''బొగ్గు ఉత్పత్తిలో రారాజు, తెలంగాణ సిరులవేణి, 102 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా దేశానికి వెలుగులు పంచుతున్న మన నల్ల బంగారం సింగరేణి సంస్థ 103 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సింగరేణి కార్మిక సోదరులకు, యాజమాన్యానికి శుభాకాంక్షలు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి ప్రత్యేక చొరవతో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో, లాభాల్లో, కార్మికుల సంక్షేమంలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసి సంస్థను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటాం. కార్మికుల పక్షాన పోరాడుతాం.'' అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు సింగరేణి కార్మికులు ధరించే హెల్మెట్ వేసుకుని పిడికిలి బిగించిన కేసీఆర్ ఫోటోను జతచేశారు.
Also Read....