బీఆర్ఎస్‌కు షాక్.. 18 మంది సర్పంచ్‌ల రాజీనామా!

కొమురంభీం జిల్లాలో బీఆర్ఎస్‌కు 18 మంది సర్పంచ్‌లు షాక్ ఇచ్చారు.

Update: 2022-12-27 08:58 GMT

దిశ, వెబ్ డెస్క్: కొమురంభీం జిల్లాలో బీఆర్ఎస్‌కు 18 మంది సర్పంచ్‌లు షాక్ ఇచ్చారు. జిల్లాలోని వాంకిడి మండలంలో 18 మంది సర్పంచ్‌లు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. నిధులు లేవని పట్టించుకునే వారు లేరని బీఆర్ఎస్ సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. 18 మంది బీఆర్ఎస్ సర్పంచ్‌లు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.  

Tags:    

Similar News