తెలుగు రాష్ట్రాల వరద నష్టంపై అమిత్ షాకు శివరాజ్ సింగ్ ప్రాథమిక నివేదిక

సెప్టెంబర్ మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-11 12:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : సెప్టెంబర్ మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో వరదలు మిగిల్చిన తీవ్ర నష్టాన్ని అంచనా వేయడానికి స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (shivaraj singh chouhan) పర్యటించారు. తెలంగాణ (Telangana)లోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించగా.. ఏపీ (AP)లోని విజయవాడ బుడమేరు ముంపు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు. కాగా వరద నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను బుధవారం శివరాజ్ సింగ్ చౌహాన్.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amith sha)కు సమర్పించారు. తెలంగాణ, ఏపీలోని వరద బాధిత ప్రాంతాల్లో నేడు మరో కేంద్రబృందం పర్యటిస్తోందని, కేంద్రబృందం నివేదిక ఇచ్చిన అనంతరం రెండింటినీ పరిశీలించి రాష్ట్రాలకు విపత్తు సహాయాన్ని ప్రకటిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలియ జేశారు. అయితే భారీ వర్షాలు, వరదల వల్ల అతలాకుతలం అయిన రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తక్షణ సహాయం కింద రూ. 3300 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.  


Similar News