సింగరేణి కార్మికులకు భారీ బోనస్ ప్రకటించిన సీఎం రేవంత్

సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ బోనస్ ప్రకటించారు.

Update: 2024-09-20 11:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ బోనస్ ప్రకటించారు. కార్మికులకు దసరా బోనస్‌ను ముందుగానే ప్రకటిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రోజు (శుక్రవారం) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సెక్రటేరియట్‌లో ఆయన ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల పోరాట పటిమ అందరికీ స్ఫూర్తి అని, తెలంగాణ ఉద్యమంలో వారిది కీలక పాత్ర అని కొనియాడారు.

అలాంటి కార్మికుల గొప్పతనాన్ని తమ ప్రభుత్వం గౌరవిస్తుందని.. అందుకే దసరా బోనస్‌ను ముందుగానే ఇస్తున్నామని అన్నారు. ప్రతి కార్మికుడికి లక్షా 90 వేల రూపాయలు బోనస్ ఇస్తున్నామని, అంటే గతేడాది కంటే 20 వేలు అధికంగా అందిస్తున్నామని చెప్పారు. ఈ బోనస్ కోసం ప్రభుత్వం రూ.796 కోట్లను వెచ్చిస్తోందని తెలిపారు. అంతేకాకుండా ఇకపై సింగరేణి లాభాల్లో కార్మికులకు కూడా వాటా ఇస్తామని, కనీసం 33 శాతం లాభాలు వారికి పంచుతామని వెల్లడించారు.


Similar News