పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యానికి ఊదాహరణ.. సీఎం రేవంత్ రెడ్డిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి సచివాలయంలో సమావేశం అయిన విషయం తెలిసిందే.

Update: 2024-09-20 11:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి సచివాలయంలో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశంలో పాల్గొన్న స్కిల్ వర్సిటీ బోర్డు చైర్మన్, ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా శుక్రవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ప్రశంసలు కురిపించారు.

‘నిన్న హైదరాబాద్‌లో జరిగిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్శిటీ తొలి సభకు హాజరుకావడం నిజంగా ఆనందంగా ఉంది. ఎం రేవంత్ రెడ్డి, మీరు మీ ఉద్దేశాన్ని కార్యరూపంలోకి తీసుకురావడం చూసి నేను చాలా ఆనందించాను. మీరు మీ వ్యాఖ్యలలో సంక్షిప్తంగా, క్లుప్తంగా ఉన్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం ఎలా పని చేయాలి అనే దానికి బలమైన ఉదాహరణ, ఇది ప్రాథమికంగా పరస్పర విశ్వాసం ఆధారంగా నిర్మించబడాలి’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే వర్సిటీకి ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించింది. 150 ఎకరాల స్థలం సైతం రేవంత్ సర్కార్ కేటాయించింది. అయితే సీఎంతో స్కిల్ వర్సిటీ మీటింగ్‌లో ఆనంద్ మహీంద్రాతో పాటు, సుచిత్ర ఎల్లా, నారా బ్రాహ్మణి, ఎంఎం మురుగప్పన్ లాంటి వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.


Similar News