సర్కారు ఆసుపత్రుల పరిశీలనకు బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీ

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను, సమస్యలను పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీ నియమించినట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.

Update: 2024-09-20 10:59 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను, సమస్యలను పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీ నియమించినట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన వైద్య ఆరోగ్య పరిస్థితుల పతనంపైన భారత రాష్ట్ర సమితి ఒక నిజనిర్ధారణ, అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి డా. రాజయ్య అధ్యక్షతన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ లతో కమిటీ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈ కమిటీ గాంధీ ఆసుపత్రితో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రులను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నిర్మాణాత్మకమైన సూచనలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. 


Similar News