కేసీఆర్ వారికి క్షమాపణ చెప్పాలి : శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు

అచ్చంపేటలోని నక్షత్ర హోటల్‌లో శివసేన పార్టీ నాగర్ కర్నూల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష్యులు సింకారు శివాజీ పాల్గోన్నారు.

Update: 2023-08-02 11:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: అచ్చంపేటలోని నక్షత్ర హోటల్‌లో శివసేన పార్టీ నాగర్ కర్నూల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష్యులు సింకారు శివాజీ పాల్గోన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్రలో రైతు రాజ్యం రావాలని అంటున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైందా అంటు ప్రశ్నించారు. రైతు రాజ్యం అంటే ఏమిటీ..? బలవంతంగా భూములు లాక్కోవటమా.. రైతులకు బేడీలు వేసి జైలుకు పంపడమా, ఇప్పటి వరకు ఋణ మాఫీ చెయ్యకపోవటమా, పంటకు గిట్టు బాటు ధర ఇవ్వనందుకా, వర్షాణికి పంటలు నీటిలో మునిగితే ఆధుకోనందుకా, పొలం దున్నే కౌలు రైతులకు రైతు బందు ఇవ్వనందుకా, లేదంటే ఉచిత ఎరువులు ఇవ్వకపోవటమా అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల పైన ప్రశ్నలువేస్తూ ఘాటుగా స్పందించారు. ఇక ఆర్టీసి ఉద్యగులను రెగ్యూలర్ చేయండంపై స్పందించారు. ఆర్టీసీ ఉద్యగులు రోడ్డు మీదకు వచ్చి రెండు నెలల పాటు సమ్మెలో పాల్గొంటే ఉద్యోగులను భయపెట్టి తిరిగి వీధుల్లో చేర్చుకున్న కేసీఆర్ ఆర్టీసి ఉద్యగులను ప్రభుత్వంలో కల్పుకుంటుంన్నామంటే నవ్వోస్తుందని అన్నారు.

ఆర్టీసీ ఉద్యగులను ప్రభుత్వంలో కల్పితే నష్టం లేదు కానీ ఆర్టీసీ భూములను ఖబ్జా చేస్తే అసలు సమస్య మొదలైతుందని అన్నారు. ఎప్పటి నుంచో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ ఆస్తులపైన కన్ను ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సమ్మె సమయంలో మరణించిన వారి కుటుంబాల దగ్గరకు వెళ్లి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత బంధు దగాకోరులు ఎవరని ప్రశ్నించారు. దళిత బంధు స్కీం పేరిట దోచుకున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఎవరో పేర్లు బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలలో శివసేన పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాలో అనేక సమస్యలపై పోరాటం చేశామని ఇక్కడ శివసేన పార్టీకి ప్రజల నుంచి మద్దతు ఉంటుందని అబిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా విద్యార్థి సేన అధ్యక్షులు మారుతీ, యువసేన జిల్లా అధ్యక్షులు విష్ణు, విద్యార్థి సేన జిల్లా ప్రధాన కార్యదర్శులు గుడ్లనరం సాయి, వెంకటేశ్, దెవపూజ అఖిల్‌, యువ సేన జిల్లా ప్రధాన కార్యదర్శులు సిజ్జు, శంకర్, సాయి తదితరులు పాల్గొన్నారు.


Similar News