సుద్దాల హన్మంతు-జానకమ్మ జాతీయ పురస్కార ప్రదానం

ప్రముఖ జానపద కళాకారుడు, తెలంగాణ విమోచనోద్యమకారుడు 'సుద్దాల హన్మంతు-జానకమ్మ' జాతీయ పురస్కార ప్రదాన కార్యక్రమం నేడు అట్టహాసంగా జరిగింది.

Update: 2024-10-19 16:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ జానపద కళాకారుడు, తెలంగాణ విమోచనోద్యమకారుడు 'సుద్దాల హన్మంతు-జానకమ్మ' జాతీయ పురస్కార ప్రదాన కార్యక్రమం నేడు అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పురస్కార ప్రదానోత్సవ వేడుక జరిగింది. ఈ ఏడాదికి గాను అరుణోదయ కళాకారుడు నాగన్నకు పురస్కారాన్ని ప్రకటించారు. నేడు జరిగిన పురస్కార ప్రదానోత్సవ వేడుకలో నాగన్న-లక్ష్మి దంపతులను.. జస్టిస్ నగేష్, సుద్దాల అశోక్ తేజ, బీమపాక భారతి ఘనంగా సత్కరించి, బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాకారుడు నాగన్న సుద్దాల ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. 


Similar News