వీసీల నియామకంలో అన్ని వర్గాలకు న్యాయం: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

‘‘కేటీఆర్ నువ్వెంత...నీ చదువెంత..”అని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్​, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అమెరికాలో చదివినా అనే అహంకారం పనికిరాదన్నారు.

Update: 2024-10-19 16:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘కేటీఆర్ నువ్వెంత...నీ చదువెంత..”అని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్​, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అమెరికాలో చదివినా అనే అహంకారం పనికిరాదన్నారు. కేటీఆర్ తో స్పెల్లింగ్ ఛాలెంజ్ కు సిద్ధమన్నారు. శనివారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంతో వీరు మాట్లాడుతూ...వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో దళితులకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర లో ఇప్పటి వరకు ఒక దళితుడు కూడా వీసీ కాలేదన్నారు. మహిళా యూనివర్సిటీ కి ఒక గిరిజన మహిళను వీసీగా నియమించారన్నారు. అన్ని వర్గాలు కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తున్నారన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ మోసం చేశాడని, కానీ తమ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు. మాదిగ లకు ఇచ్చిన మాట ను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారన్నారు. వీసీల నియామకంలో ప్రాధాన్యత ఇచ్చి దళితులపై సీఎం అభిమానాన్ని చాటుకున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు రెండూ ఒకటేనని, కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని వివరించారు.


Similar News