చిన్నారిని కాపాడిన వ్యక్తిని సన్మానించిన షిఖా గోయెల్
పౌరులు కాస్త ధైర్యంగా వ్యవహరిస్తే పలు నేరాలను అరికట్ట వచ్చని ఉమెన్‌సేఫ్టీ వింగ్ అదనపు డీజీపీ షిఖా గోయెల్ అన్నారు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పౌరులు కాస్త ధైర్యంగా వ్యవహరిస్తే పలు నేరాలను అరికట్ట వచ్చని ఉమెన్‌సేఫ్టీ వింగ్అదనపు డీజీపీ షిఖా గోయెల్అన్నారు. తమ కళ్ల ముందు నేరం జరుగుతున్నా చాలామంది పట్టనట్టుగా ఉండిపోతారని అంటూ ఆపదలో ఉన్నవారిని కాపాడటం కనీస ధర్మంగా పాటించాలని సూచించారు. ఎర్రమంజిల్రైల్వే స్టేషన్వద్ద ఓ వ్యక్తి ముక్కుపచ్చలారని చిన్నారిపై అఘాయిత్యానికి ప్రయత్నించగా అడ్డుకుని నిందితుడు అరెస్టు అయ్యేలా చూసిన కళ్యాణ్‌ను తన కార్యాలయంలో మంగళవారం షిఖా గోయెల్సన్మానించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారిని కాపాడిన కళ్యాణ్‌కు అభినందనలు తెలియచేశారు.