ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు.. ఈటల పార్టీలు మారారు: షబ్బీర్ ఆలీ ఫైర్
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి రూ. 25 కోట్లు తీసుకుందని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి రూ. 25 కోట్లు తీసుకుందని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ఈటల రాజేందర్ చేసిన ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. దీంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన ప్రతిపక్షాలు దానిని పక్కన పెట్టి.. ఒకరిపై మరొకరు మాటలు యుద్ధానికి దిగుతున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నుండి డబ్బులు తీసుకుందన్న ఈటల ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా సీన్ మారిపోయింది.
ఇక, ఈటల చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ స్పందించారు. ఈటల రాజేందర్‌పై ఆయన విరుచుకుపడ్డారు. ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు ఈటల రాజేందర్ పార్టీలు మార్చారని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు అందరి ఇళ్ల చుట్టూ ఈటల తిరుగుతున్నారన్నారు. ఈటల రాజేందర్ రాజకీయంగా దిగజారి వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. ఈటల ఖబడ్దార్.. కాంగ్రెస్ గురించి జాగ్రత్తగా మాట్లాడాలని షబ్బీర్ ఆలీ హెచ్చరించారు.