కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సెర్బియా ఆహ్వానం

భారత పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి.. సెర్బియా పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈఏడాది ఫిబ్రవరి 22 నుంచి 25వ తేదీ వరకు బెల్‌గ్రేడ్‌లో

Update: 2024-01-19 14:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భారత పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి.. సెర్బియా పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈఏడాది ఫిబ్రవరి 22 నుంచి 25వ తేదీ వరకు బెల్‌గ్రేడ్‌లో జరిగే.. 45వ ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్(ఐటీఎఫ్)కు హాజరుకావాలని.. సెర్బియా పర్యాటక శాఖ మంత్రి హుసేన్ మెమిక్ ఆహ్వానపత్రాన్ని పంపించారు. యూరప్, సెర్బియా ప్రాంతంలో పర్యాటక రంగాభివృద్ధికి జరిగే అతిపెద్ద ఈవెంట్‌గా ఇది నిలవనుంది. గత 30 ఏళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతుండగా.. ఈసారి ‘అడ్వెంచర్ బిగిన్స్ హియర్’ అనే థీమ్‌తో ఈ ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్ జరగనుంది. వివిధ దేశాలనుంచి పర్యాటక శాఖల మంత్రులు, ఈ రంగానికి సంబంధించిన భాగస్వామ్య పక్షాలు, ఇన్వెస్టర్లు ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొననున్నారు.

Tags:    

Similar News