రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం సంచలన ఆదేశాలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రైతుబంధుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-07-11 14:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రైతుబంధుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతు బంధు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం పోచారం రైతు యాదగిరి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వెంచర్లపై ఇచ్చిన రైతుబంధు సొమ్ము రికవరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతు బంధుగా తీసుకున్న రూ. 16 లక్షలు తిరిగి చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. గతంలో 33 ఎకరాల భూమిని ప్లాట్లుగా చేసి యాదగిరిరెడ్డి అమ్మినట్లు ప్రభుత్వం గుర్తించింది. 33 ఎకరాల ప్లాట్ల భూమిపై యాదిగిరిరెడ్డికి రూ.16 లక్షల రైతుబంధు చెల్లింపు జరిగినట్లు తేల్చింది. 


Similar News