Breaking: అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. పరిగణనలోకి ఈడీ ఛార్జ్‌షీట్‌

అగ్రిగోల్డ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది...

Update: 2024-11-07 13:46 GMT

దిశ, వెబ్ డెస్క్: అగ్రిగోల్డ్ కేసు(Agrigold Case )లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈడీ(Enforcement Directorate) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌‌ను నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు(Nampally MSJ Court) పరిగణనలోకి తీసుకుంది. మొత్తం 32 లక్షల ఖాతాదారుల నుంచి అగ్రి గోల్డ్ సంస్థ రూ.6,380 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్‌ నికోబార్‌లో రూ.4,141 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో 14 మందిని అరెస్ట్ చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్ పేర్లతో పాటు అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపైనా ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. తాజాగా ఈడీ ఛార్జిషీటును కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News