ఎన్నికల వేళ తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం

తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎస్ఐబీలో పనిచేసిన డీఎస్పీ ప్రణీత్ రావును సస్పెండ్ చేసింది.

Update: 2024-03-04 16:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఫోన్లు ట్యాంపరింగ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ ప్రణీత్ రావును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎస్ఐబీలో పనిచేసిన డీఎస్పీ ప్రణీత్ రావు కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులకు చెందిన మొబైల్ ఫోన్లను ట్యాంపరింగ్ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సెల్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేసినట్టు సమాచారం. అప్పట్లో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ సైతం తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నట్టు ఆరోపణలు చేశారు. కాగా, తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రణీత్ కుమార్ ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు తేలటంతో ప్రస్తుతం డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న ప్రణీత్ రావును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    

Similar News