Sama Rammohan Reddy : కేంద్రం డైవర్షన్ రాజకీయమే అల్లు అర్జున్ రచ్చ : సామ
కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం(Modi's Government) డైవర్షన్ రాజకీయ(Diversion is politics) వ్యూహంలో భాగంగానే అల్లు అర్జున్(Allu Arjun)అరెస్టుపై బీజేపీ రచ్చ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy)ఎక్స్ వేదికగా ఆరోపించారు.
దిశ, వెబ్ డెస్క్ : కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం(Modi's Government) డైవర్షన్ రాజకీయ(Diversion is politics) వ్యూహంలో భాగంగానే అల్లు అర్జున్(Allu Arjun)అరెస్టుపై బీజేపీ రచ్చ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy)ఎక్స్ వేదికగా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నుల బాదుడు, అదానీ జేపీసీ, అంబేద్కర్ వ్యవహారాల్ని పక్కదారి పట్టించడానికి గోడి(మోడీ) మీడియా ఎత్తుకున్న అంశమే అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారమని పేర్కొన్నారు. గోడి మీడియా రాజకీయ సర్కస్ లో ఆడిపించడానికి బీఆర్ఎస్ ఎడ్డి గొర్రెలు చిక్కాయని ఎద్దేవా చేశారు.
అది సర్కస్ అని తెల్వక బీఆర్ఎస్ పార్టీని జాతీయ హోదాకు ఎత్తామని గంతులేస్తున్న గొర్రెలే ఈ జోకర్లని... మీ తెలివికి మల్ల పబ్లిసిటీ ఒకటని రామ్మోహన్ బీఆర్ఎస్ నేతలను విమర్శించారు. కటారాగాళ్ళు అని దేశమంతా బీఆర్ఎస్ నేతలు మల్లొక్కసారి నిరూపించుకున్నారని..వృద్ధిచెందని సైకో రామ్ పిచ్చి గొర్రె తెలివి అని రామ్మోహన్ రెడ్డి వంగ్యోక్తులు విసిరారు.