Shravan Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం.. ఆయన నోరు తెరిస్తే వారు జైలుకేనా?

ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది.

Update: 2025-03-29 11:42 GMT
Shravan Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం.. ఆయన నోరు తెరిస్తే వారు జైలుకేనా?
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone tapping case) నిందితుడు శ్రవణ్ రావు (Shravan Rao) విచారణ కొనసాగుతున్నది. సిట్ (SIT) నోటీసులతో ఇవాళ జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు విచారణకు హాజరైన శ్రవణ్ రావును అధికారులు దాదాపు 5 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. శ్రవణ్ రావు ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా పలు కీలక అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ వెనుక ప్రధాన సూత్రధారి ఎవరు? గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో మీకున్న పరిచయాలేంటి? ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడ కొనుగోలు చేశారు? ఎవరి ఆదేశాలతో ఆఫీస్ లో సర్వర్లు పెట్టుకున్నారు? ఎంత కాలం నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు మీ వద్ద ఉంచుకున్నారని ప్రశ్నించినట్లు తెలింసింది. ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేశారు? ఎన్నికల సమయంలో ఎంతమంది ఫోన్లను ట్యాప్ చేశారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇన్నాళ్లపాటు విదేశాల్లో ఎక్కడ తలదాచుకున్నారు అనే అంశాలపై కూపీ లాగినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో శ్రవణ్ రావు స్టేట్ మెంట్ అత్యంత కీలకంగా మారనుందని తెలుస్తోంది. ఆయన నోరు విప్పితే పలువురు కీలక నేతలు జైలుకు వెళ్లే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విచారణలో శ్రవణ్ రావు ఎలాంటి సమాధానాలు ఇస్తున్నారనేది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News