Congress: కేసీఆర్ మాకు ఎక్కడా అన్యాయం చేయలేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

నాకు మంత్రి పదవి కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Update: 2025-03-18 09:14 GMT
Congress: కేసీఆర్ మాకు ఎక్కడా అన్యాయం చేయలేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ లో (Telangana Congress) మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్ గా మారుతుంది. ఏడాది కాలం దాటినా ఇంకా కేబినెట్ విస్తరణ కాలేదు. ఈ విషయంలో ఇప్పటికే పలు ధపాలుగా అధిష్టానం చర్చలు, సంప్రదింపులు జరుపుతోంది. దీంతో ఆశావహులంతా కేబినెట్ లో బెర్త్ ఖరారు చేసుకునేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణపై దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (Balu Naik) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు మా సామాజిక వర్గం నుంచి కేబినెట్ లో ఒక్కరూ లేరని మా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలన్నారు. నేను కూడా మంత్రి వర్గ పోటీలో ఉన్నానని హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన.. కాంగ్రెస్ ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా కేబినెట్ లో మా సామాజిక వర్గం నుంచి ఎవరూ లేరు అనే అసంతృప్తి మా వర్గం ప్రజల్లో ఉందన్నారు.

కేసీఆర్ అన్యాయం చేయలేదు:

కేసీఆర్ హయంలో మా సామాజిక వర్గానికి కేబినెట్ లో స్థానం దక్కింది. నిజానికి మా సామాజిక వర్గానికి కేసీఆర్ (KCR) ఎక్కడ అన్యాయం చేయలేదని అయినా లంబాడీలు కాంగ్రెస్ కు ఓట్లు వేశారన్నారు. నాకు డిప్యూటీ స్పీకర్ పదవి మా వర్గానికి చెందిన మరొకరికి ఇంకేదో పదవి ఇవ్వడం కాదు. కేబినెట్ లో బెర్త్ కావాలనే డిమాండ్ ఉందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లా మంత్రి పదవి కావాలి అనే డిమాండ్ నా నుంచి లేదు. మైదాన ప్రాంతాలకు చెందిన ఏ గిరిజన నాయకుడు మంత్రి పదవి దక్కలేదు. అందువల్ల నేను మంత్రిగా ఉండాలని ప్రజలే కోరుకుంటున్నారన్నారు. అధిష్టానం, సీఎం రేవంత్ మంత్రి పదవి విషయంలో సానుకూలంగా ఉన్నారని చెప్పారు.

అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ!:

మంత్రివర్గ విస్తరణపై (Cabinet expansion) ఏఐసీసీ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే కేబినెట్ విస్తరణ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధిష్టానం పెద్దలు రాష్ట్ర నేతలకు సమాచారం పంపించారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల రాష్ట్రానికి కొత్తగా నియమించిన ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి, ప్రభుత్వ పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న అధిష్ఠానం తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని సజావుగా జరిగితే ఉగాది నాటికి మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ పోస్టుల విషయంలోను త్వరలోనే భర్తీ చేసేందుకు పార్టీ పెద్దలు సన్నద్ధం ప్రచారం జరుగుతోంది.


Read More..

MLC vs Minister: మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు  

దీన్నీ అన్నావంటే గూబ పగులుద్ది.. హీరో నితిన్‌‌కు స్ట్రాంగ్ వార్నింగ్  

Tags:    

Similar News