సత్యమేవ జయతే..!.. కేసీఆర్ కేసులో తీర్పుపై కేటీఆర్ సంచలన ట్వీట్
సత్యమేవ జయతే.. త్వరలో ప్రజాకోర్టు కూడా ఇలాంటి తీర్పును వెలువరించనుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సత్యమేవ జయతే.. త్వరలో ప్రజాకోర్టు కూడా ఇలాంటి తీర్పును వెలువరించనుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వేసిన విద్యుత్ కమీషన్ ను రద్దు చేయాలన్న కేసీఆర్ వేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సత్యమేవ జయతే! అంటూ రాజకీయ పగ, బలిదానాలకు పరిమితులు ఉన్నాయని, బాధితులను ఎక్కువ కాలం భరించలేమని సుప్రీంకోర్టు తీర్పు పునరుద్ఘాటించిందని అన్నారు. కేసీఆర్ కేసులో అధికార దుర్వినియోగంపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసిందని తెలిపారు. అలాగే త్వరలో ప్రజాకోర్టు కూడా ఇలాంటి తీర్పును వెలువరించనుందని వ్యాఖ్యానించారు.
దురుద్దేశపూరిత ప్రచారానికి గాను కాంగ్రెస్‌ను సర్వశక్తివంతమైన కోర్టు శిక్షిస్తుందని చెబుతూ.. సత్యం ఒక్కటే విజయం! సాధిస్తుందని రాసుకోచ్చారు. కాగా, గత ప్రభుత్వ పాలనలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని, దీనిపై విచారణ నిమిత్తం కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై కేసీఆర్ ఈ కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, దీన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. కేసీఆర్ పిటీషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. దీనిపై కేసీఆర్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. కేసీఆర్ పిటీషన్ పై మంగళవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. జస్టిస్ నర్సింహారెడ్డి స్థానంలో మరో జడ్జిని నియమించాలని కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.