బిల్లుల బకాయిల కోసం గవర్నర్ ను కలిసిన సర్పంచుల సంఘం ప్రతినిధులు

సర్పంచుల సంఘం ప్రతినిధులు గవర్నర్ ను కలిశారు.

Update: 2024-06-30 10:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సర్పంచ్ ల సంఘం ప్రతినిధులు తెలంగాణ గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్ ను కలిశారు. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లుల జాప్యం చేస్తున్నారంటూ గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు. ఆదివారం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశమైన తమ సమస్యలను చెప్పుకున్నారు. సర్పంచ్ లు పదవీ కాలం ముగిసి 6 నెలలు అయినా తమ బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా లాభం లేకుండా పోతోందని అందువల్ల పెండింగ్ బిల్లులు తక్షణమే ప్రభుత్వం మంజూరు చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగకూడదనే ఉద్దేశంతో అప్పులు తీసుకువచ్చి పనులు చేయించారని బిల్లులు రాకపోవడంతో అప్పులకు వడ్డీలు కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అప్పుల భారం పెరిగి అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తమ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

Tags:    

Similar News