Sama: ఎవరు జైలుకు వెళ్లాలో మీరే చెప్పండి.. ఆర్ఎస్పీకి సామా రామ్మోహన్ కౌంటర్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).. ఎవరిది నిజాయితీ?? ఎవరు స్వచ్ఛందంగా జైలుకు పోవాలి? అని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్(Congress Media Committe Chairman) సామా రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) ప్రశ్నించారు.
దిశ, వెబ్ డెస్క్: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).. ఎవరిది నిజాయితీ?? ఎవరు స్వచ్ఛందంగా జైలుకు పోవాలి? అని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్(Congress Media Committe Chairman) సామా రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) ప్రశ్నించారు. మాగనూరు(Maganooru) ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. నిజాయితీ ఉంటే స్వచ్ఛందంగా మీరే జైలుకు వెళ్ళండి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. దీనిపై స్పందించిన సామా.. కేసీఆర్(KCR) హయాంలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రవీణ్ కుమార్ వేసిన పోస్ట్‌లను ఆధారాలుగా చూపిస్తూ కౌంటర్(Counter) ఇచ్చారు. దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరిది నిజాయితీ.. ఎవరికి జైలుకు పోవాలో చెప్పాలని నిలదీశారు. అంతేగాక విద్యావ్యవస్థనే ఆగం చేసి సమస్యలు, దురదృష్ట సంఘటనలపై పదేళ్లలో ఏనాడూ స్పందించని మీ నాయకుడు కేసీఆర్ స్వచ్ఛందంగా జైలుకు వెళ్లి పాపాలని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దానికి సాక్ష్యం గతంలో మీరు పెట్టిన ప్రభుత్వ స్పందనకు నోచుకోని ట్వీట్లు కాదా అని మండిపడ్డారు. అలాగే ఈ రోజు నారాయణపేట జిల్లా- మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగడం దురదృష్టకరమని, అయితే ఘటన జరిగిన నిమిషాల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఘటనపై ఆరా తీశారని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుకొని వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. కారణాలేమిటో దర్యాప్తు చేసి బాధ్యులెవరో నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్(Collector) ను సీఎం ఆదేశించినట్లు వివరించారు. ఇక ‘నాసిరకం భోజనం పెడితే జైల్లో వేస్తా’ అన్న ముఖ్యమంత్రి వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు కూడా తీసుకుంటారు. కంగారుపడకండి అని చెప్పారు. కల్వ' కుట్రల ' రాజకీయాలు కాకుండా.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏ విధంగా ముందుకు వెళదామో సూచనలు చేయాలని సామా రాసుకొచ్చారు.