Sama Rammohan: కేటీఆర్ నోటి వెంట బీజేపీ మాటలు.. ఆవ్యాఖ్యల వెనుక మర్మం ఇదే

రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నారని సామరామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ే

Update: 2024-08-19 11:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాజీవ్ గాంధీ పేరును తొలగిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలు బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సంకేతం అని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. బీజేపీ మాటలే కేటీఆర్ నోటివెంట వస్తున్నాయని ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కూడా మీ అహంకారం తగ్గలేదని ద్వజమెత్తారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీరు తొలగించేలోపే తెలంగాణ ప్రజలు మీ పార్టీకి ఘోరి కడతారన్నారు. అసలు మీ పార్టీ ఉంటేనే కదా మళ్లీ మీకు అధికారం వచ్చేది అని సెటైర్ వేశారు. సోమవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన సామ రామ్మోహన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండగ చేసుకుంటుంటే బీఆర్ఎస్ మాత్రం దిష్టి తీసే కార్యక్రమానికి పూనుకుందని మండిపడ్డారు. రుణమాఫీ వియంలో బీఆర్ఎస్ తన సొంత కార్యకర్తల సెల్పీ వీడియోలు చేయిస్తూ చేత ఫేక్ నిరసనలు చేపిస్తోందని ధ్వజమెత్తారు. పంద్రాగస్టు నాటి వరకు జరిగిన రుణమాఫీలో ఎక్కడా నిరసనలు జరగలేదని, కానీ రూ.2 లక్షల రుణమాఫీ విషయంలోనే బీఆర్ఎస్ తన రాజకీయాన్ని మొదలు పెట్టిందన్నారు. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న డూప్లికేట్ నిరసనలకు రైతుల నుంచి నిరసన వ్యక్తం అవుతున్నదన్నారు.

బీఆర్ఎస్ మొదటి ఐదేళ్లలో నాలుగు దఫాలుగా చేసిన రుణమాఫీ నగదు వల్ల రైతులకు రుణవిముక్తి జరగలేదని వడ్డీలకే సరిపోయిందని ధ్వజమెత్తారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే అదనపు మొత్తాన్ని చెల్లించిన తర్వాతే రూ. 2 లక్షల వరకు రుణమాఫీ అమలు అవుతుందని ప్రభుత్వం ముందుగానే నిర్దేశించిందని అయినా సిగ్గులేకుండ బీఆర్ఎస్ 2.50 లక్షల రుణం ఉన్నవారికి మాఫీ కావడం లేదు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రేషన్ కార్డులు లేని వారికి రుణమాఫీ కావడంలేదని ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నిబంధనలు కూడా బీఆర్ఎస్ హయంలో తీసుకువచ్చిన నిబంధనలే కాంగ్రెస్ అమలు చేస్తున్నదన్నారు. రుణమాఫీ కాని వారు అధికారుల వద్దకు వెళ్తే మాఫీ చేస్తారన్నారు. కేసీర్, హరీశ్ రావు మీకు కొంచెమైనా నైతికత మీకు ఉంటే జనాలకు వాస్తవాలు చెప్పాలన్నారు. జనాలను పక్కదారి పట్టించే ప్రత్నాలు చేస్తే మీ పార్టీని పక్కకు జరుపుతారని హెచ్చరించారు. 

Tags:    

Similar News