శుభవార్త.. భారీగా పెరిగిన వేతనాలు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తోన్న శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2022-08-23 02:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తోన్న శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పారిశుధ్య కార్మికుల కనీస వేతనాన్ని 50శాతం పెంచింది. ప్రస్తుతం రూ.10,700 వస్తుండగా దానిని రూ.15,600కు పెంచారు. అంతేగాక, ఇకనుంచి నేరుగా జీతాలు వారి అకౌంట్లో జమ అయ్యేలా చేశారు. అలాగే ఒక్కో బెడ్‌కు పారిశుధ్య నిర్వాహణ చార్జీలను రూ.7500 లకు(గతంలో రూ.5 వేలు) పెంచింది. పరిశుభ్రతను మెరుగుపర్చేందుకు నూతనంగా తీసుకొచ్చిన IHFMS విధానానికి అనుగుణంగా వేతనాలను ప్రభుత్వం పెంచుతూ సర్క్యూలర్ జారీ చేసింది.

అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. వాస్తవానికి మార్చి నుంచే కొత్త వేతనాలతో పాటు పీఎఫ్, ఈఎస్ఐలను అమలు చేయాల్సి ఉంది. కానీ, కాంట్రాక్ట్‌లు తీసుకున్న కొన్ని సంస్ధలు నిబంధన ప్రకారం వేతనాలు ఇవ్వలేదు. ఉద్యోగులను సతాయిస్తూ వచ్చాయి. ఓపిక నశించిన కార్మికులు డీఎంఈ ఆఫీసులను వరుసగా ముట్టడిస్తూ న్యాయం చేయాలని డిమాండ్​చేశారు. దీంతో పెంచిన వేతనాలను తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనంటూ సర్కార్​మరోసారి సర్క్యూలర్‌‌ను జారీ చేసింది.

Tags:    

Similar News