VC Sajjanar : మీ వాట్సాప్ హ్యాక్ అయ్యే చాన్స్! అలా చేయకండని సజ్జనార్ కీలక సూచన

వాట్సాప్ మోసాల పట్ల జాగ్రత్త అంటూ టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు.

Update: 2024-11-16 07:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వాట్సాప్ (WhatsApp) మోసాల పట్ల జాగ్రత్త అంటూ టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (VC.Sajjanar) కీలక సూచనలు చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. సైబ‌ర్ నేర‌గాళ్లు వాట్సాప్ ఖాతాల‌ను హ్యాక్ చేస్తున్నారని తెలిపారు. బ్యాంకింగ్, వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని సేక‌రించి మోసాల‌కు తెర‌లేపుతున్నారని, అంతేకాకుండా.. మీకు తెలిసిన వ్య‌క్తుల‌కు మీ పేరుతో సందేశాలు పంపిస్తూ డ‌బ్బులు అడుగుతున్నారని వెల్లడించారు. తెలియని లింక్‌లపై అస‌లే క్లిక్ చేయవద్దని సూచించారు. మీకు మెసేజ్ లేదా ఇమెయిల్ ద్వారా లింక్ వస్తే, మీరు పొరపాటున ఆ లింక్‌పై క్లిక్ చేస్తే, మీ వాట్సాప్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు.

వాట్సాప్ స్కామ్ బారిన పడకుండా ఉండేందుకు వాట్సాప్‌లో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వంటి సెక్యూరిటీ ఫీచర్ ఉందన్నారు. వాట్సాప్‌ సెట్టింగ్‌లో, అకౌంట్‌ అని ఉంటుందని, అందులో డబుల్‌ వెరిఫికేషన్‌ అని ఉంటుందని వెల్లడించారు. దాన్ని ఎనేబుల్డ్‌ చేసుకుంటే, వాట్సాప్‌ను నేరగాళ్లకు హ్యాకింగ్‌ చేయడం సాధ్యం కాదని సూచించారు. ఒక‌వేళ మీరు సైబ‌ర్ మోసానికి గురైతే వెంట‌నే మీ సమీపంలోని పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయాలని, లేదా నేష‌న‌ల్ సైబ‌ర్ క్రైం హెల్ప్ లైన్ నంబ‌ర్ ను 1930 కి కాల్ చేసి స‌మాచారం ఇవ్వాలని ట్వీట్ చేశారు.

Tags:    

Similar News